పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

క్రమశిక్షణ @

క్రమశిక్షణ  "భారతీ ! తొమ్మిదింబావు అయింది. కోర్టుకి వెళ్తున్నా !" "ఒక్క నిముషం ! కిరణ్ మిమ్మల్ని ఏదో అడగాలని అంటున్నాడు." "ఏం కిరణ్ ? ఎక్కువ టైమ్ తీసుకోకుండా చెప్పు !" "నాన్నగారూ ! ఇవాళ సాయంత్రం మా స్కూల్ ఆనివర్సరీ ! నాకు స్టడీస్ లోనూ, క్విజ్ లోనూ మూడు ప్రైజులు వచ్చాయి, ఆ ఫంక్షన్ కి మీరు, అమ్మా ఇద్దరూ వస్తారా ?" కొంచెం బిడియంగా, కొంచెం అనుమానంగా అడిగాడు కిరణ్. అలవాటు కొద్దీ చేతి గడియారం చూసుకుని "నేను ఫంక్షన్ లకి రానన్న సంగతి తెలుసు కదా ? అమ్మని తీసుకుని వెళ్ళు." అనేసి మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు జస్టిస్ చంద్రశేఖర్. ని‌స్సహాయంగా, నిట్టూరుస్తూ తల్లికేసి సజలనయనాలతో చూశాడు కిరణ్. తల్లి కూడా భారంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. ******         ****         ******* చంద్రశేఖర్ చదువులో చాలా చురుకు. తండ్రి షార్ట్ సర్వీస్ కమిషన్ లో నేవీలో పనిచేసి కమీషన్ అయిపోయిన తర్వాత ప్రైవేటుగా లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేసి జడ్జ్ అవుదామని ప్రయత్నించి సఫలుడు కాలేకపోయాడు. అందుకని చంద్రశేఖర్ ని చిన్నప్పటి నుంచి నువ్వు మిలిటరీలోకైనా వెళ్ళాలి, లేక జుడిషియరీ...