పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మనోహరం @

 మనోహరం  రోజూ సిటీ బస్ లో ఇంటి నుంచి కాలేజీ కి, కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నా, కొన్ని కొన్ని రోటీన్ సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోతాయి. వసుంధర ఆ ఊరి విమెన్స్ కాలేజ్ లో కామర్స్ లెక్చరర్ గా చేరి ఆరు నెలలవుతోంది. ప్లెజర్ బండి ఉన్నా సిటీ బస్ లో వెళ్ళడమే ఇష్టం ఆమెకి. రకరకాల జనాల్ని గమనించడం, తనకి ఇంకొక వ్యాపకమైన రచనా వ్యాసంగం లో వాళ్ళకి జీవం పోసి మంచి కధలు వ్రాయడం ఆమెకి అత్యంత సంతోషాన్నిచ్చే విషయం. గత రెండు వారాలుగా ఆమె ఒక అమ్మాయిని గమనిస్తోంది. ఆ అమ్మాయి చక్కటి రూపంతో పుస్తకాలు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని తను ఎక్కే బస్ స్టాప్ లోనే ఎక్కుతుంది. తర్వాత బస్ స్టాప్ లో దిగిపోతుంది. కొన్ని సార్లు ఆ అమ్మాయి బస్ దిగంగానే బస్ బయలుదేరేది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. రెండు మూడు సార్లు బస్ ఇంకా కొంత మందిని ఎక్కించుకోవడంలో బయల్దేరడం లేట్ అయినప్పుడు ఆ పిల్ల ఒక యువకుడి వెనకాల మోటార్ సైకిల్ మీద అతని వెనకాలే ఎక్కడం గమనించింది. ఒక్కొక్క సారి వారు బస్ ని దాటి స్పీడ్ గా వెళ్ళేవారు. ఆ పిల్ల అతని నడుము చుట్టూ చెయ్యి వేసి మనోహరంగా నవ్వుతూ కనిపించేది. వసుంధర కి మొదట్లో అందమైన జంటలాగ అనిపించిం...

ఒక హత్య కధ@

  ఒక హత్య కధ పట్టాభిరామయ్య ఇంట్లో ఆయన, భార్య శారద, కొడుకు ఆనందు, కోడలు లీల, మనవడు సుమంత్ ఉంటారు. కూతురు అనిత పెళ్ళై భర్తతో పక్క వీధిలోనే కాపురం. వీరితో పాటు లీల పినతల్లి కొడుకు చైతన్య చుట్టపు చూపుగా వచ్చి రెండు రోజులుగా ఉన్నాడు. ఆ మరునాడు హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెల్లెలికి, బావగారికి చెప్పాడు. తెల్లవారేసరికి ఆ కుటుంబ సభ్యులందరి మధ్య ఓ శవం. దిగ్భ్రాంతితో, భయంతో, ఆందోళనతో, దిక్కుతోచక ఒకరివంక ఒకరు కంగారుగా చూసుకుంటూ, నోట మాట రాక వణికిపోతూ ఆ శవం చుట్టూ నిలుచున్నారు వారంతా. ఆ శవం ఆడమనిషి ది. పైన బట్టలన్నీ ఎక్కడా చెదరలేదు. నిద్రపోతోందా అని అనిపిస్తుంది యథాలాపంగా చూస్తే ! జాగ్రత్తగా చూస్తే నోటి నుంచి ఎడమ బుగ్గ మీదకు కారిన సన్నటి నెత్తురు చార భయం కొలుపుతోంది. ఇంకా దగ్గరగా చూస్తే కళ్ళు కొంచెమే మూసుకుని ఉండి, ఎర్రటి చుక్కలు తెల్ల గుడ్డు మీద కనిపిస్తున్నాయి. ఆ మనిషి ఆ ఇంట్లో పని మనిషి కుమారి ! దాదాపు 25 ఏళ్ళ వయసు ఉంటుంది. చిలోపొలోమని నవ్వుతూ ముప్పావు గంట నుంచి గంట లోపు ఇంటి పనులన్నీ చక్కబెట్టేసి తుర్రుమంటుంది. సాయంత్రం మళ్ళీ అరగంట లోపు పనులు అవగొట్టేసి అక్కడే మొహం కడిగేసుకుని, తన బ్యాగ్ లోన...

చిన్న పాత్రలతో రామాయణం - అగస్త్యుడు

రామాయణంలో చిన్న పాత్రలు  అగస్త్యుడు   యథా శివమయో విష్ణుః రేవం విష్ణు మయశ్శివః || అగస్త్య భ్రాత కు వీడ్కోలు చెప్పి ఆయన చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్తున్నారు ముందుగా శ్రీరాముడు, ఆయన అడుగు లో అడుగులేస్తూ సీతమ్మ, వారిద్దరి వెనుక లక్ష్మణ స్వామి. ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు. కన్నుల పండువగా, ఆహ్లాదం కలిగిస్తున్నది వాతావరణం. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " తమ్ముడూ ! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు ధర్మపత్ని సీతతో, మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అపేక్షిస్తున్నారు. అనుమతి కోరుతున్నారు. " అని కబురు చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారునితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు లోనికి వెళ్లి అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పాడు. "నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా, ఒక్కడ...