పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
నాదైన శైలిలో సంక్షిప్త రామాయణం  🙏🙏🙏🙏 జగమున రాముడె చూడగా యొక్కడు  చూడ సాటి లేరు వేరు నెవరు నిజము మృదువుగ బల్కు నీతిమంతుడు యతడు మానవుడిగ జనియించు మాధవుఁడెగా   కొడుకన్న ఈతడే కొడుకు నిక్కముగాను  కౌశికు వెంటను జనెను తండ్రి జెప్ప అన్నయన్న యితడు అన్న అన్నన్న ! అస్త్ర విద్యలెల్ల అనుజు కిచ్చె  శిష్యుడన్న యితడు శిష్యుడే శిష్యుడు  అతివ తాటకిని గురువాజ్ఞను దునిమె  భగవంతుడనుకొన్న భగవంతుడే నితడు  గౌతమ పత్నిని గారవించె  వీరుడన్న నితఁడు వీరుడు శూరుడు  హరుని విల్లు నిట్టె విరచి వేసె  పుత్రుడన్న నితఁడు పుత్రుడు సత్యము  తండ్రి ఆజ్ఞ మేర తాళి గట్టె  పెద్ద వారి యెడల పెళుసు కాడితడు  పరశురాముని పట్ల ప్రేమ జూపె  పతి యన్న రాముడు పతిదేవుడేను  మైథిలికెంతను మహనీయుడయ్యె  కొమారుడన్న నితఁడు కొమరుడెర నిజముగా  తండ్రి యానమేర వనము జనియె  కౌసల్య సతి కితడు బాలుడు బాలుడే  అడవికేగ యామె వెంటబడెను  ప్రభువన్న నీతడు ప్రభువేగ చూడగ  గుహుని యాదరించి గుండె జేర్చె  అగ్రజుడిగ తాను భరతు నాదరించి  పాదుకలొసగి పం...

ఒక పౌర్ణమి కథ

ఒక పౌర్ణమి కథ ప్రసన్న ప్రవీణ్ రామ్ కి సాక్షాత్తు మేనత్త కూతురే, వరసైనదే. చిన్నతనం నుంచి సెలవులకి మేనత్త పుట్టింటికి వచ్చినపుడు కలిసి ఆడుకునే వారు.  యుక్తవయసు దగ్గర పడుతున్న కొద్దీ ఆకర్షణ కూడా ఎక్కువైంది. ఇంట్లో కూడా అన్యాపదేశంగా అనుకునే మాటలు చాటుగా విన్నవాళ్ళవడం వలన పెళ్ళి ఆలోచనలు ఇద్దరికీ కలుగుతూనే ఉన్నాయి. ప్రవీణ్ ని చూసినపుడు ప్రసన్న బుగ్గలు ఎర్రబడడము, పమిట సర్దుకోవడము, ప్రవీణ్ మనసుకి ఎంతో హాయిగా ఉండేది. ప్రవీణ్ తండ్రికి ఆమె అంటే ప్రత్యేకమైన ముద్దు తన తల్లి ప్రసన్న లక్ష్మి పేరు పెట్టారని.  తన కొడుకుకి తండ్రి పేరు రామారావు గారి పేరు చేర్చి ప్రవీణ్ రామ్ అని పేరు పెట్టుకున్నాడు.  ప్రసన్న తల్లి భారతికి కూడా మేనల్లుడంటే ప్రత్యేకమైన అభిమానం. అన్నగారు భాస్కర్ కి ముద్దుల చెల్లెలు. 'అన్నా ! నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం' అని సినిమా పాటలేం పాడలేదు కానీ అంత ప్రేమ భారతికి. ప్రసన్న తండ్రి పరమేశ్వర్ కి కూడా వారికి పెళ్ళి చేయడం గురించి అభ్యంతరం లేదు కానీ బయటపడే వాడు కాదు. అతని తత్వం అంతే ! మితభాషే కానీ కొంచెం కోపధారి. చివరికి రెండు వైపులా సరే అనుకుని తాంబూలాలు పుచ్చుకుందామని అనుకు...