కబంధుడు
రామాయణం లో చిన్న పాత్రలు కబంధుడు జటాయువు మరణం తర్వాత అంత్యక్రియలు, తర్పణాలు ఇవ్వడం అయిన తరువాత అశ్రునయనాలతో దండకారణ్యం దాటి నైఱుతి దిశగా ప్రయాణించి క్రౌంచారణ్యం ప్రవేశించారు శ్రీ రామ లక్ష్మణులు. కొంత దూరం సాగాక భయంకరమైన శబ్దాలు చేస్తూ ఒక వికృతాకార రూపిణి వారికి అడ్డంగా వచ్చి వారిద్దరినీ తేరిపార చూచి లక్ష్మణుడిని చేత చిక్కించుకుంది. "ఆహా ! ఎర్రగా కళకళలాడుతూ ఉన్నావు. నా పేరు అయోముఖి. ఈ ప్రాంతంలో నాకు సాటియైన రాక్షసి, నా కన్నా అందగత్తె లేదు . నిన్ను ఆ మన్మధుడే నాకు భర్తగా పంపాడని అనిపిస్తోంది. ప్రియతమా ! నన్ను పెళ్ళాడి నీ భార్యగా చేసుకో. మనం స్వర్గసుఖాలను ఆనుభవిద్దాము. రా ! ప్రియతమా!" అన్నది. కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇటువంటి ప్రతిపాదన, అందునా రాక్షస స్త్రీ దగ్గరనుంచి వచ్చేసరికి లక్ష్మణుడు ఆగ్రహం హద్దులు దాటిపోయింది. ఒక్క ఉదుటున తన కరవాలం తీసి కనురెప్పపాటులో ఆమె నాసాగ్రానినీ, స్తనాగ్రానాలను కోసేసాడు. హాహాకారాలు చేస్తూ ఆ వికృత రూపిణి ఆ అడవిలోకి పరిగెత్తింది. ఆ తర్వాత వారిద్దరూ సీతమ్మ కోసం వెతుకుతూండగా మేఘ గర్జన వినబడింది. శ్రీ రాముడు త...