పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అనాలోచితం@

అనాలోచితం  "సునీతా ! సాయంత్రం ఆఫీస్ తర్వాత అవుటాఫ్ స్టేట్ ఆడిటర్స్ తో బాసు మీటింగ్ పెట్టాడు. ఒక గంట లేటవుతుంది. ఒక్క దానివీ ఉండగలవా ? పోనీ సుజాత ఉంటుందా ? గంట అన్నాడు కానీ ఇంకా లేట్ అవచ్చు. ఎం సుజాతా ? నీకేమైనా ప్రాబ్లమా ? మామూలుగా అయితే ఒక్కర్తీ ఉండగలదు కానీ తన పరిస్థితి తెలుసు కదా ? ప్లీజ్ !" "అదేమిటి బావా ! అంతగా ప్రాధేయ పడక్కర లేదు . ఇంటికి ఫోన్ చేసి చెప్తానులే. ఇవాళ రాత్రికి ఇక్కడ ఉండిపోతాను. లేట్ అయితే ఇక్కడనుంచి ఎల్ బీ నగర్ కి వెళ్లడం కూడా మంచిది కాదు. రాత్రి పూట అంత దూరం డ్రైవ్ చెయ్యడం డేంజర్." అన్నది మరదలు సుజాత  మామగారు ఉండేది ఎల్ బీ నగర్. తాను ఉండేది అత్తాపూర్. సునీత కి యుటిరస్ ప్రాబ్లమ్ కి స్కానింగులు, టెస్టులు చేయించుకోవడంతో నీరసంగా ఉండడం వలన ఆ రోజు అక్కతో గడుపుదామని వచ్చింది సుజాత. ఎం టెక్ ప్రీవియస్ చదువుతున్నది. పెళ్లి ఇప్పుడప్పుడే ఒద్దని ఇంట్లో కరాఖండీగా చెప్పేసరికి మామగారు అల్లుడిని ఎలాగైనా ఒప్పించమని బతిమాలాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి సునీతతో కలిసి ఆమెని కన్విన్స్ చేద్దామని అనుకున్నమాధవ్ అనుకోని మీటింగ్ వలన కొద్దిగా నిరాశ పడ్డాడు.  కాఫీ ...

వాసంత సమీరం@

వాసంత సమీరం డాక్టర్ శంకరనారాయణ ఆ రోజు మొదటి పేషెంట్ నుంచి అతని బాధను గురీంచిన వివరాలు అడిగి ఓపికగా పరీక్ష చేసి మందులు వ్రాసి పంపించేశారు. వరుసగా ఐదుగురిని చూసి పంపేశాక కొద్దిగా పరిచయం ఉన్న రామచంద్రరావు ఒక యువకుడిని తీసుకుని వచ్చాడు. అతను చాలా సంతోషంగా "గుడ్ మార్నింగ్ సార్ ! గుర్తు పట్టారా ?" అన్న తర్వాత అతని ముఖాన్ని తేరిపార చూసి "మీ పేరు విక్రమ్ కదా ? మూడేళ్ళ క్రితం చూసాను! బాగా మారిపోయారు !" అన్నాడాయన. "మీరు నన్ను మీరు అని అనవద్దు డాక్టర్ గారూ ! మీకన్న చాలా చిన్నవాడిని !" అన్నాడు  అంతకు మూడేళ్ళ ముందు దీనస్థితిలో చికిత్స కోసం వచ్చిన ఆ విక్రమ్ కీ ఇప్పటి విక్రమ్ కీ చాలా మార్పు వచ్చింది. అప్పుడు ఒళ్ళంతా ఎందుకొచ్చిందో తెలియని దురదతో ఆకలి పూర్తిగా పోయి కళ్ళు లోతుకి పోయిన విక్రమ్ కళ్ళముందు కదలాడాడు. అంతకు ముందు ఆరు నెలలుగా దురదలతో బాధపడుతూ ఆకలి తగ్గిపోయి బరువు తగ్గిపోయి స్పెషలిస్ట్ లకి చూపించుకుని, ఫలితం లేక మేనమామ తో వచ్చి కళ్ళనీళ్ళు తో వేడుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. బీటెక్ పూర్తి చేసి ఎమ్ బి ఏ కోసం క్యాట్ పరీక్షకు తయారవుతున్నాడు. ఐ ఐ ఎమ్ బెంగుళూరు కానీ, ...

చిన్న పాత్రలతో రామాయణం -. మారీచుడు

రామాయణంలో చిన్న పాత్రలు  మారీచుడు  పక్షుల కిలకిల కలకలారవాలతో సందడిగా ఉన్న ఆ చిట్టడవిలో సర్రుమంటూ బాణం దూసుకుపోవడమేమిటి, అది లక్ష్యాన్ని తాకగానే వికృతంగా హరిణి మరణరావం ఆ వనమంతా ప్రతిధ్వనించింది. ..!! క్షణంలో మనిషి గొంతుక అంతకన్నా వికృతంగా, "హా సీతా ! హా లక్ష్మణా !" అని దిక్కులు పిక్కటిల్లేలా వినబడింది.  ఆ బాణప్రయోగం చేసిన ఆజానుబాహుడు, చామనచాయ రంగులో, పురుషులనైనా మోహంలో ఓలలాడించగలిగిన రూపసి శ్రీ రాముడు రవంత తొట్రుపాటు తో భృకుటి ముడిచి తన బాణం చేరిన లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేసాడు.  అక్కడికి చేరే లోపు మరొకసారి "హా సీతా ! హా లక్ష్మణా !" అని ఇంచుక తక్కువ తీవ్రతతో కేక వచ్చింది. ఈ సారి శ్రీరాముడి నడకలో వేగం ఎక్కువయ్యింది.  ఆ కేక వినిపించిన చోటికి చేరిన ఆ వీరునికి అనూహ్యమైనది కాకపోయినా, జుగుప్స కలిగించే దృశ్యం కనబడింది.  బంగరు రంగులతో మిలమిల మెరుస్తున్న సారంగం బదులు కాలవర్ణంతో, జటావల్కలాలతో వికృత రూపం తో తాపసి కనిపించాడు.  రాముడు కనపడగానే ఆ తాపసి మోములో ఒక మెరుపు, వర్ణించనలవికాని ఆనందం, కన్నీరు !  వందనమాచరించడానికా అన్నట్లు చేతులెత్తాడు. పూర్తి చేయడా...

నేనున్నా నీకు రక్షణ @

నేనున్నా నీకు రక్షణ  హమ్మయ్య ! అనుకుని కంప్యూటర్ లాగ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసి అలసటగా కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు లక్ష్మీనారాయణ.  మూడు రోజులుగా ఓవర్సీస్ క్లయింటు తో హోరా హోరీ గా వీడియో కాల్స్ లో పోరాడి తమ కంపెనీ ఇచ్చిన ప్రోగ్రామ్ లో తప్పు లేదనీ, వాళ్ళవైపే ఎక్జిక్యూషన్ పొరపాటు జరిగిందనీ ఒప్పించేసరికి తాతలు దిగిచ్చినంత పనైంది. మూడు రోజులూ ఆఫీజులోనే ఫుడ్డూ బెడ్డూ. రోజుకి ఏ మధ్యాహ్నం పూటనో ఒక నాలుగు గంటలు కోడి కునుకు అంతే ! ఏమి చేస్తారు ? కంపెనీకి అతి ముఖ్యమైన క్లయింటు. కోట్ల రూపాయిల డీల్ ! పైగా తప్పు ఇటువైపు ఉన్నదని తేలితే పరువు పోవడం అటుంచి కంపెనీ పేరు పోవడం ఖాయం.  అందుకనే బాస్ స్వయంగా వచ్చి లక్ష్మీనారాయణని కౌగలించుకుని అభినందించాడు.  "సర్ ! రేపు ఆఫ్ తీసుకుంటాను సర్ ! మూడు రోజులైంది ఇంటి ముఖం చూసి " అన్నాడు బాస్ మూడ్ కనిపెట్టి.  "నో ప్రాబ్లమ్ మై బోయ్ ! రేపు, ఎల్లుండి కూడా ఆఫ్ తీసుకో ! యూ డిజర్వ్ రెస్ట్ !" అన్నాడు బాసు .  ******** "లక్ష్మీ ! బాగా అలిసిపోయి ఉన్నావు. ముందుగా బరిస్తా లో మంచి కాఫీ తాగుదాము. ఆ తర్వాత నన్ను ఇంట్లో దింపి వెళ్దువు గాని" అన్నది ...

ఆలుమగలు@

  ఆలుమగలు ఫోన్ లో ప్రాణ స్నేహితుడు శివ శంకర్ హాస్పిటల్ లో ఐ సి యూ లో ఉన్నాడని, ఇంకా కొద్దిగంటలే ఉన్నది అంతిమ ఘడియలకి అని చెప్పారని తెలిసి హడావుడిగా బయల్దేరాడు మారుతీ ప్రసాద్. ఊహించిన కబురే ఐనా ఆ సమయంలో గొంతుకి ఏదో తెలియని వస్తువు అడ్డం పడినట్లు ఫీలింగ్. కళ్ళ నీళ్ళు ఊరుతున్నాయి.  అంతకు నెలరోజుల క్రితమే శివశంకర్ భార్య అంబిక హఠాత్తుగా మరణించింది. ఆమె చాలా రోజులనుండి ఊపిరితిత్తులలో నెమ్ము తో బాధ పడుతున్నా అంత హఠాత్తుగా పోతుందని ఎవరూ ఊహించలేదు. స్నేహితులిద్దరి మధ్య కూడా ఆ ప్రస్తావన రానేలేదు. వారిద్దరి మధ్య శివ శంకర్ కాన్సర్ గురించే చర్చలు జరిగేవి. శివశంకర్ కి ప్రోస్టేట్ కి సంబంధించిన కాన్సర్. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగానే కంట్రోల్ అయింది.  అంబిక కు ఈ విషయం చెప్పొద్దని మిత్రుడి దగ్గర మాట తీసుకున్నాడు శివశంకర్. మొదటిలోనే గుర్తించారు కాబట్టి దాదాపు పూర్తిగా నయమవచ్చు అని డాక్టర్ చెప్పాడు.  ఈ విషయం తెలిస్తే అంబిక ఆరోగ్యం ఏమౌతుందో అని ఆమెకు చెప్పద్దని స్నేహితుడిని అభ్యర్ధించాడు శివశంకర్.  వారిద్దరికీ పిల్లలు లేరు. ఇద్దరి వైపూ దగ్గరి బంధువులు కూడా ఎవరూ లేరు. శివశంకర్ ...

చిన్న పాత్రలతో రామాయణం. -. అహల్య

రామాయణంలో చిన్న పాత్రలు  అహల్య  సిద్ధాశ్రమం దాటి రమ్యమైన వనవాటికలు, అరణ్యాలు దాటి జనపదంలో అడుగిడిన రాముడు విశ్వామిత్ర మహర్షిని కుతూహలంగా ఆ దేశం గురించి వినగోరాడు.  అది విశాలా నగరమనీ, ఇక్ష్వాకు అలంబుస లకు పుట్టిన పరమ  ధార్మికుడైన విశాలుని పేర ఈ నగరము వర్ధిల్లుచున్నదనీ, ఆ నగరాన్ని పరిపాలించే సుమతి అనే ధర్మాత్ముడి గురించి, ఆయన పూర్వీకులైన హేమచంద్ర, సుచంద్ర, ధూమ్రాశ్వ, సృంజయ, సహదేవ, కుశాశ్వ, సోమదత్తుల గురించి, సోమదత్తుని కుమారుడైన కాకుత్సుని, అతని కుమారుడైన సుమతి గురించి కూడా మహర్షి వివరించారు. ఆ రాత్రి సుమతి మహారాజు ఆతిధ్యం స్వీకరించి మరునాడు అనుష్టానానంతరం మిథిలా నగరం వైపు ప్రయాణం అయ్యారు విశ్వామిత్ర మహర్షి, ఆ వెనుక రామ లక్ష్మణులు.  కొంత దూరం ప్రయాణించిన తర్వాత రమణీయంగా ఉండినా నిర్జనంగా ఉన్న అరణ్యాన్ని చూశాడు రామచంద్రుడు. పచ్చని చెట్లు, లతలు, గుల్మాలు కనువిందు చేస్తున్నా నర సంచారమే కాక పశు, మృగ, విహంగాలు కూడా కానరావడం లేదు. మంద్రంగా ప్రణవ నాదాన్ని పోలిన శబ్దం విన వస్తున్నది.  "మహాత్మా ! ఈ ప్రదేశం అందచందాలతో అలరారుతున్నా నిర్జీవంగా తోస్తున్నది. ఇటువంటి అరణ్యం ...

ఇల్లాలు@

ఇల్లాలు భార్య మణి మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్న చంద్రమోహన్ ఆమె రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నిమురుతున్నాడు.  గుండెలో దావాగ్ని మండుతున్నా, పెదాలమీద చిరునవ్వు చెరగలేదు.  మణి కూడా శరీరం శుష్కించి పోయినా కళ తప్పని మొహంలో మందహాసం తగ్గనివ్వలేదు.  "ఇంకా ఎన్ని రోజులన్నారు డాక్టర్ గారు ?" "రెండు లేకపోతే మూడు రోజులు అన్నాడు" నిర్వేదంతో బదులిచ్చాడు చంద్రమోహన్. "మీరూ త్వరగా వచ్చెయ్యండి, లేకపోతే నాకు తోచదు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తుందిగా?" "మర్చిపోతే కదా మణీ ?" "త్వరగా ఎందుకు రమ్మన్నానో తెలుసా ? మీరు కూడా వచ్చేసి ముందు మీరు పుట్టెయ్యాలి ! ఆ తర్వాత నేను ! లేకపోతే లెక్క తేడా వస్తుంది !" ప్రశ్నార్ధకంగా చూసిన భర్త మొహంలో అయోమయాన్ని చూసి పరిహాసంగా"నేను ఎప్పుడూ పాడుకునే, నాకెంతో ఇష్టం ఐన పాట ఏమిటి ?" అనడిగింది. వెంటనే గుర్తుకొచ్చింది చంద్రమోహన్ కి. చిన్నగా నవ్వుతూ"గుర్తొచ్చింది, ఇల్లాలు లో పాటేగా ?" "ఒక్కసారి చిన్నగా పాడరూ ?" జీరపోయిన గొంతు ఒకసారి సవరించుకుని  "నీవు నా ఊహలందే నిలిచావూ,  నేను నీ...