పోస్ట్‌లు

నవంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

రాధిక

  కీర్తన డాక్టర్ చెప్పిన‌ మాటలకు తెల్లబోయి చూసింది. "మీరు చెప్తోంది నిజమేనా డాక్టర్! తను ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లల తల్లి. నాకు తెలిసినంత వరకూ ఆమె భర్త అర్జున్ చాలా మంచివాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. తన లైఫ్లో‌ ఎలాంటి ఒత్తిళ్ళు, ఆరళ్ళు లేవు. అలాంటప్పుడు దానికి ఇలా చేయవలసిన అవసరమేం ఉంటుంది...??" "చూడండి కీర్తనా! నువ్వు మా శ్రీరామ్ భార్యవి, ఈమె ప్రాణ స్నేహితురాలివి కనుక నీకు పేషెంట్ పరిస్థితిని గురించిన వివరంగా చెప్పాను. ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటో కానీ... ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ కి అలవాటు పడుతోందని మాత్రం చెప్పగలను. ఈ విషయం ఆమె భర్తకు ఇన్ఫామ్ చేసారా!?" అడిగాడు డాక్టర్ విక్రమ్. "ఫోన్ కలవట్లేదు, మెసేజ్ పెట్టాను. అతను ఆఫీస్ పని మీద హాంగ్ కాంగ్ వెళ్లాడని చెప్పారు పిల్లలు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అతని కోసం." చెప్పింది కీర్తన. "సరే! ఆమెకు మెలకువ వచ్చేప్పటికీ అటెండెంట్ ఎవరో ఒకరు ఆమెతో ఉండేలా చూసుకోండి. అసలే తీవ్రమైన డిప్రెషన్ లో ఉందామె. నేను మధ్యాహ్నం మళ్లీ వస్తాను." చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్. "నేనే ఉంటాను తన...

విధి @

  బయట వాకిట్లో అమ్మాయి గొంతుక వినిపిస్తోంది. ఎవర్నో ఏదో వివరాలు అడుగుతున్నట్లుంది. ఆగి ఆగి సంభాషణ వినిపిస్తోంది. వినికిడి తక్కువ అవడం వలన అస్పష్టంగా ఉంది. నారాయణరావు నిస్త్రాణ గా అలాగే పడుకుండిపోయాడు. "పాపా !" అని పిలిచాడు పీలగొంతుకతో. ఆ సన్నటి గొంతు ఆమెకు ఎలా వినపడిందో కాని వెంటనే లోపలికి వచ్చింది. "ఎవరదీ ? వెచ్చాలకొట్టు ఆవిడేనా ?" "కాదు. తాలూకా ఆఫీసు నుంచి ! ఏవో వివరాలు అడుగుతోంది !" "మన గురించి వివరాలేం ఉంటాయి ? రేషన్ కార్డు గురించా ? మన గులాబి కార్డు దేనికీ ఉపయోగించదు కదా ? ఇంకేం కావాలి ?" చొరవగా లోపలికి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుని "నా పేరు లావణ్య అండీ! ఎమ్ ఆర్వో ఆఫీసులో ఆరైగా ఉంటున్నాను. మీకు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు కదా ? దాని కోసం వచ్చాను. మీ గురించి వివరాలు సేకరించి ఫోటో తీసుకుని ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తాము." అన్నదామె. "ఎప్పటి దరఖాస్తమ్మా ? మూడు నెలలు అయింది. ఇప్పటికి తీరుబడి అయిందా ?" అని కొద్దిగా గొంతు పెంచి అడిగాడు నారాయణరావు. "మీరు అప్లై చేసినప్పటి ఆరై గారికి అప్పటిలో రోడ్డు ప్ర...

అక్కరకొచ్చిన_అనుభవం

గ్రేస్ స్కూటీ పార్క్ చేసి చురుకుగా నడుస్తూ ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో కోవిడ్ వార్డ్ ఏ‌ కి చేరుకుంది. నర్సెస్ రూమ్ లో తన లాకర్ తెరిచి చక చక తన వాచీ, మొబైల్, పర్స్ వంటివి పెట్టేసి తాళం వేసి ఆ పక్కనే సీల్ చేసి ఉన్న ప్యాక్ నుంచి డిస్పోజబుల్ ఫేస్ షీల్డ్ ధరించి వేరే నడవా లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర పద్ధతి ప్రకారం చేతులు మోచేతులవరకూ సబ్బుతో ఐదు నిమిషాల పాటు కడుక్కుని ఆ పక్కనే ఉన్న హాట్ ఎయిర్ బ్లోయర్ లో తడి ఆరే దాకా ఉంచి అవతల వైపు ఉన్న స్టెరైల్ జోన్ అని ఉన్న గ్లాస్ డోర్ తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ సానిటైజర్ తో చేతులు రెండూ ఇంకొకసారి శుభ్రం చేసుకుని తను ధరించిన ఫేస్ షీల్డ్ వేరే బిన్ లో పడేసింది. అక్కడ ఉన్న పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ కంటెయినర్ మూతని తీసి పి పి ఈ కిట్ తీసి అంతే చురుకుతో వరుస ప్రకారం ముందు చేతులకి గ్లౌస్, పాదాల తొడుగులు వేసుకుని, మాస్క్ ధరించింది, ఆ తర్వాత కళ్ళకు గాగుల్స్ వేసుకుని ఆ పైన ఫుల్ గౌన్ ధరించింది. చివరగా వేరే జత గ్లౌస్ అంతకు ముందు వేసుకున్న గ్లౌస్ మీద తొడుగుకుని వార్డ్ లో ప్రవేశించింది. హాస్పిటల్ కి వచ్చాక యూనిట్ లో ప్రవేశించడానికి ఇరవై నిముషాలు పట్టింది....

బంగారు రోజులు

"అక్కా ! అక్కా !" వెనక్కి తిరిగి చూసింది అమృత. పదడుగుల దూరంలో వడివడిగా నడుస్తూ తనకేసి వస్తున్న ఆకారాన్ని వెంటనే పోల్చుకోలేకపోయింది. అప్పుడే మొదలైన చిరుజల్లు కళ్ళజోడుని తడిపేసింది. "అమృతక్కా !" ఆ గొంతుక చాలా పరిచితంగా ఉన్నది. జ్ఞాపకాల మూలలలో హడావుడిగా వెతికి దొరకబుచ్చుకునే సరికి మొహంమీద చిరునవ్వు, ఆ తమ్ముడు సమీపంలోకి రావడం ఒకేసారి జరిగాయి. గొడుగు విప్పి ఆమె తల మీద పట్టాడతను. "పతంజలీ ! ఎన్నాళ్ళకీ ? ఎక్కడ ఉన్నావు ? ఏం చేస్తున్నావు ?" "ఇక్కడే అక్కా ! జనరల్ ప్రాక్టీస్. టైమ్ పాస్ ! అంతే !" "అవును. పీజీ చెయ్యలేదని తెలిసింది. ఏమైంది ?" "ఎంట్రెన్స్ అయీ అవగానే పెళ్ళి చేసేశారు. అమ్మకి అనారోగ్యం అని ! కానీ పెళ్లి తర్వాత ఏం జబ్బు లేకుండా నాన్నగారు వెళ్లిపోయారు. అమ్మ అనారోగ్యం తోడు ఈ బాధ తట్టుకోలేక నాలుగు నెలలు తిరగకుండానే తనుకూడా వెళ్ళిపోయింది. ఆ ఎంట్రెన్స్ లో కొద్దిలో క్లినికల్ సబ్జెక్టుల్లో సీట్లు అయిపోయాయి. చాలా కాంపిటీషన్. నీకు తెలుసుకదా ! ఆ తర్వాత రెండు మూడు సార్లు ప్రిపరేషన్ సరిగా లేక బోర్డర్ లోకి కూడా రాలేకపోయాను. చివరికి జనరల్ ప్రాక్టీస...