పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ మనసు @

అమ్మ మనసు  ఐ సి యు లోనుంచి బయటికొచ్చి గౌను, మాస్కు విప్పుతున్న కాంచన  కేసి ప్రశార్ధకం గా చూసాడు గౌరీశంకర్.  నిర్లిప్తంగా ఉన్న ఆమె ముఖం చూసి మనస్సు కలుక్కుమంది. "ఎట్లా ఉన్నదంటావు ?" అని అడిగాడు. "గుర్తు పట్టలేదు. కళ్ళు అప్పుడప్పుడు తెరిచి చూస్తోంది. నన్ను చూసి కూడా ముఖం లో ఏమీ మార్పు లేదు." 'పిలిచి చూశావా " అని అడిగాడు ఆశగా.  "లేదు" అని క్లుప్తంగా అని. "నేను వెయిట్ చేస్తాను" అని వెళ్ళిపోయింది కాంచన. కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి అతనికి. గౌను, మాస్కు ధరించి లోపలకి వెళ్ళాడు. ******* చిన్నతనం నుంచి అంటే జ్ఞానం వచ్చినప్పటి నుంచి తల్లి అంటే మొదలు కొంత భయము, తరువాత కొంత కోపము, చివరికి వైముఖ్యం కాంచనలో పాతుకుపోయింది. ఒక్కతే కూతురు అని తల్లి తనను ముద్దు చేసిన గుర్తు లేదు కాంచనకి. తండ్రి దగ్గరే చనువు ఎక్కువ. పదో క్లాసు వరకూ ఇంట్లోనే ఉంది చదివినా తల్లి మీద ఉక్రోషం తో ఇంటరు, ఇంజనీరింగ్ హాస్టల్ లో ఉండి చదువుకుంది. తండ్రితోనే ఎక్కువ ఫోన్లో మాట్లాడేది. తల్లితో పొడి పొడిగా ఎదో నాలుగు మాటలు. అంతే ! ఫైనల్ ఇయర్లో క్లాసు మేట్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని...

నేస్తం@

నేస్తం కిటికీ దగ్గర మంచం మీద కూర్చుని బయటికి నిస్తేజంగా చూస్తున్న హరీష్ ని చూసి శారద మనసు విలవిలలాడింది.  "హరీ ! ఇంకా అంగదుడు కనిపించలేదా  ?" "లేదమ్మా  ! ఇవాళ నాలుగో రోజు  ! ఆ కొండముచ్చులు రాకపోతే అంగదుడూ నేను హాపీగా కబుర్లు చెప్పుకునేవారం ! " విచారంగా బదులిచ్చాడు ఆరేళ్ల హరీష్.  థలసిమియాతో బాధ పడుతున్న హరీష్ ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. చురుకైన వాడు.  చదువుకున్న తర్వాత హరీష్ టైమ్ అంతా అంగదుడితో గడిచి పోతుంది.  అంగదుడంటే హరీష్ కి బాగా చనువైన ఉడత. చిన్న పిల్లగా ఉన్నపుడు కిటికీ దగ్గర ఆడుతుండగా హరీష్ వేరుశెనగ పప్పు, ఆక్రూట్ పప్పులు పెట్టి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాతే హరీష్ ఆరోగ్యం లో మంచి మార్పు కనబడింది  అటువంటిది ఓ రోజు కొండముచ్చుల గుంపు వెంటబడితే  భయపడి పరిగెత్తాడు అంగదుడు. దానివెంట ఓ నాల్గు కొండముచ్చులు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ దాని ఆచూకీ తెలియలేదు. శారద ఎంతో బాధపడింది.  హరీష్ ఆరోగ్యం దిగజారుతుందేమోనని బెంగ కూడా పెట్టుకుంది. దానికి తగ్గట్లే  సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఒళ్లు  వెచ్చబడడం మొదలయ్యింది.  దానితో ఇంకా బేజారెత్...

ఊహాతీతం@

ఊహాతీతం సుందరి పడుతూనే అందరిలా ఏడవలేదు నవ్వుతున్నట్టే ఉంది కళ్లు మూసుకుని డాక్టర్లకి నర్సులకు  తీసుకువచ్చి తల్లి రాణి దగ్గర పడుకోపెట్టిన నర్స్ మీరు చాలా అదృష్టవంతులు ఏడవకుండా నవ్వే పాప పుట్టింది అని చెప్పింది  పెద్దవుతున్నకొద్ది సుందరి ఏడ్చింది వేళ్లమీద లెక్క పెట్టవచ్చు టివిలో వచ్చే హాస్యప్రోగ్రాములు చూస్తు విరగబడి నవ్వేది  తల్లి సుందరి మొదట్లో సంతోషించినా తరువాత బెంగ పెట్టుకుంది-ఆడపిల్ల ఇలా నవ్వుతే రేపు కాలేజి పెళ్లయ్యాక అత్తవారు ఏమనుకుంటారు అని సుందరిని మందలించినా పోమ్మా నవ్వు వస్తే నవ్వక ఏమి చెయ్యమంటావు అని అనేది తండ్రి ఆమెని సమర్ధించేవాడు అలా హాయిగా నవ్వడానికి పెట్టి పుట్టాలి అని—— స్కూలు లో  గర్ల్స్ ఓన్లీ అవడం వలన పెద్దగా సమస్య కాలేదు. టీచర్లు కూడా పేరెంట్స్ మీట్ లో కంప్లైంట్ లు చేసేవారు కాదు.  సుందరి చదువులో టాప్ అవడం వలన అందరికీ ముద్దుగానే ఉండేది. టెన్త్ లో స్కూలుకే కాక జిల్లా ఫష్టు, స్టేట్ మూడో ర్యాంకులో పాసయే సరికి ఆమె నవ్వు పెద్ద ఎస్సెట్ అయిపోయింది.  ఇంటర్ మీడియేట్ పేరు మోసిన కాలేజ్ వారు కోరి ఫీజు పూర్తి రాయితీ ఇచ్చి చేర్చుకున్నారు. అందరితో స్నేహం...