సామ్యం @
సామ్యం
"ఒరేయ్ అబ్బాయ్ ! నీకు యుక్త వయసు వచ్చింది. స్థిరపడే దిశగా ఉన్నావు, అందుకే నేను, అమ్మ నీకు వివాహం చేద్దామని అనుకుంటున్నాం."
"ఇంకా అనుకుంటూనే ఉన్నారుగా ? నిర్ణయం చేసేయ్యలేదుగా ? బ్రతికించారు. నాకు ఇంకా పెళ్లి మీద ఆలోచనలు లేవు. దాని గురించి ప్రస్తావన తేవద్దు."*******
"నాయనా ! ఉద్యోగం లో కూడా స్థిరపడ్డావు ఒక ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకున్నావు ఇప్పుడైనా సరే ఆనరా !"
"ఊహూ ! నా టార్గెట్ ఇంకా రీచ్ కాలేదు. పైగా ఇప్పుడు చేసుకున్నానంటే ఆ పిల్ల ఏమి తంటాలు తెస్తుందో ? వివాహం సర్వ నాశాయ అన్నది నా అభిప్రాయం."
*****
"నాన్నా. ఉద్యోగంలో కూడా బాగా పైకి వచ్చావు. ఇప్పటికైనా చేసుకోరా ! చాలా మంది నా ప్రాణాలు తీస్తున్నారు. నీ పెళ్లి ఎప్పుడు చేస్తానని."
"వాళ్లకి అంత ఆత్రం గా ఉంటే వేరే సంబంధాలు చూసుకోమని చెప్పు నాన్నా ! నాకు నా భార్య గురించి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాకు సరిపోయే అమ్మాయి నాకు దొరికి తీరుతుంది. నువ్వు మొన్న చెప్పిన అమ్మాయికి స్క్రూ లూజ్ , ఆ ఢిల్లీ అమ్మాయికి ఇంకో అఫ్ఫెయిర్ ఉందిట . బెంగళూరు అమ్మాయిని చేసుకుంటే కాపురం కొల్లేరే అని నా ఫ్రెండ్ చెప్పాడు. కటక్ అమ్మాయికి ఇదే మొదటి సంబంధం ఆటగా ? ఇంత వయసు వచ్చాక ఇప్పుడు సంబంధాలేమిటీ ఆమెకు ? నాకైతే ఎక్కడో డౌటు కొట్టేస్తోంది."
*******
"ఒరేయ్ ! వయసు దాటిపోతోందని అమ్మ మొత్తుకుంటోంది ! ఇప్పటికైనా ఆ విజయవాడ సంబంధం లేకపోతే పాలకొల్లు సంబంధమైనా చేసుకోరా !"
"సరే నాన్నా ఏదో ఒకటి చూడు."
********
"నాన్నా ఆ పాలకొల్లు అమ్మాయి సంగతేమయిందీ ?"
"నా బొంద అయింది ! నువ్వు ప్రతి అమ్మాయికి వంకలు పెడుతుంటే అటు వాళ్లకు మంచి సంబంధాలు వచ్చి పెళ్లిళ్లు అయిపోయాయి . నేను ఎదురు పడితే ఆడపిల్లల తండ్రులు మొహం చాటేస్తున్నారు. చేసుకోరా అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరామా నేనూ అమ్మానూ ? ఇప్పుడు సంబంధాలే ఎక్కడా కనిపించడం లేదు, ఎదురు కట్నం ఇస్తామన్నా ! నీ ఏడుపేదో నువ్వే ఏడు . మాకు ఓపిక లేదు. ఇంతకూ ముందు పెళ్లై విడాకులైనా, వితంతువైనా, వరహీనమైనా, పిల్లలు ఉన్నా నువ్వే కుదుర్చుకో ! నెల తక్కువ కుంకానీ !!"
********
"నాన్నా ! ఎవ్వరూ దొరకడం లేదు నాన్నా ! నీకు గవర్నమెంట్ లో పరపతి ఉన్న వాళ్ళు తెలుసు కదా ? ఏమైనా ...... ?"
********
ఇప్పుడు ఈ సినేరియో పరికించండి
********
"అబ్బాయ్ ! వాక్సిన్లు వచ్చేశాయి ఫ్రీగా కూడా వేస్తున్నారు వేయించుకోకూడదూ ?"
"అదేంటి నాన్నా ! అవి 60 ఏళ్ళు దాటిన వారికి కదా ? నాకు అప్పుడే వాక్సిన్ ఏంటీ ?"
******
"తండ్రీ ! డాక్టర్నని చెప్పి నాకూ, అమ్మకీ కూడా మొదటి డోస్ వేసేశారు. కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీగా వేసేస్తున్నారు. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాం. నువ్వు కూడా వేయించేసుకోరా"
"ఎహె ! అది పంజేస్తోందో లేదో ఇంకా తెలియదు. ఇప్పడు అనవసరంగా ఈ తద్దినం నాకెందుకు ?"
*******
"బాబూ ! రెండు రకాల వ్యాక్సిన్ వచ్చేశాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వేయించేసుకోరా !"
సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని
.వేయించుకోవడమేనా? ఫలానా వాక్సిన్ రష్ష్యా ది. నేను అమెరికా కంపెనీ ! వాళ్ల వ్యాక్సిన్ నాకొద్దు ఇదేమో మోడి మనమీద బలవంతంగా రుద్దుతున్నాడు ముసలాడు. పైగా అది హలాల్ చెయ్యలేదు, పేడి ఐపోతామని మా ఫ్రెండు పాషా హెచ్చరించాడు. నాకు ఒద్దు బాబూ !"
"అది కాదురా ! నాకూ అమ్మకీ రెండో డోసు కూడా అయిపోయింది, ఇప్పుడు మా అసోసియేషన్ లో వాక్సిన్ కాంప్ వైండ్ అప్ చేస్తున్నారు. త్వరగా వేయించుకోరా !"
"నాన్నా ! నన్ను చంపకు, నేను ఎక్కడ వేస్తారో వాకబు చేసి తర్వాత వేయించుకుంటాలే !"
********
",నాన్నా ! మీ అసోసియేషన్ హాలులో ఇంకా వాక్సిన్ వేస్తున్నారా ? నేను వేయించుకుంటాను. "
"లేదు రా! ఇప్పుడు డాక్టరు లకి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వేస్తున్నారు. వేయించుకుంటావా ? అక్కడి ఇన్ చార్జ్ నా ఫ్రెండే !"
"ప్రైమరీ హెల్త్ సెంటరా? నాకొద్దు !"
*******
"నాన్నా! మీ ఫ్రెండుకి చెప్తావా ? ఇవాళ వాక్సిన్ వేయించుకుంటాను."
"నీ బొంద ! వాడెప్పుడో దూరంలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ కి డ్యూటీ వేయించుకున్నాడు. పైగా వాక్సిన్ కోసం తన్నుకుంటున్నారుట. నీ ఖర్మ "
"నాఆఆఆఆన్నా !" 😭😭😭😭
ఇదండీ పరిస్థితి !!
"అది కాదురా ! నాకూ అమ్మకీ రెండో డోసు కూడా అయిపోయింది, ఇప్పుడు మా అసోసియేషన్ లో వాక్సిన్ కాంప్ వైండ్ అప్ చేస్తున్నారు. త్వరగా వేయించుకోరా !"
"నాన్నా ! నన్ను చంపకు, నేను ఎక్కడ వేస్తారో వాకబు చేసి తర్వాత వేయించుకుంటాలే !"
********
",నాన్నా ! మీ అసోసియేషన్ హాలులో ఇంకా వాక్సిన్ వేస్తున్నారా ? నేను వేయించుకుంటాను. "
"లేదు రా! ఇప్పుడు డాక్టరు లకి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వేస్తున్నారు. వేయించుకుంటావా ? అక్కడి ఇన్ చార్జ్ నా ఫ్రెండే !"
"ప్రైమరీ హెల్త్ సెంటరా? నాకొద్దు !"
*******
"నాన్నా! మీ ఫ్రెండుకి చెప్తావా ? ఇవాళ వాక్సిన్ వేయించుకుంటాను."
"నీ బొంద ! వాడెప్పుడో దూరంలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ కి డ్యూటీ వేయించుకున్నాడు. పైగా వాక్సిన్ కోసం తన్నుకుంటున్నారుట. నీ ఖర్మ "
"నాఆఆఆఆన్నా !" 😭😭😭😭
ఇదండీ పరిస్థితి !!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి