చిన్న పాత్రలతో రామాయణం - అగస్త్యుడు
అగస్త్యుడు
యథా శివమయో విష్ణుః రేవం విష్ణు మయశ్శివః ||
అగస్త్య భ్రాత కు వీడ్కోలు చెప్పి ఆయన చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్తున్నారు ముందుగా శ్రీరాముడు, ఆయన అడుగు లో అడుగులేస్తూ సీతమ్మ, వారిద్దరి వెనుక లక్ష్మణ స్వామి. ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు. కన్నుల పండువగా, ఆహ్లాదం కలిగిస్తున్నది వాతావరణం.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " తమ్ముడూ ! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు ధర్మపత్ని సీతతో, మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అపేక్షిస్తున్నారు. అనుమతి కోరుతున్నారు. " అని కబురు చెయ్యి అన్నాడు.
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారునితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు లోనికి వెళ్లి అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పాడు.
"నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా, ఒక్కడవే వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు " అని అన్నాడు అగస్త్యుడు.
సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి చోటుకి వెళుతుండగా బ్రహ్మ దేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, చంద్రుడు, ధాత, వాయువు, నాగేంద్రుడు, ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, యముడు మొదలైనవారి పూజా స్థానములు విడివిడిగా ఉన్నాయి.
"అన్నయ్యా ! అనేకమంది దేవీ దేవతలు విరాజిల్లుతున్నారు ఇక్కడ. విశేషమేమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది" అన్నాడు లక్ష్మణుడు.
"వీరందరూ అనుదినమూ అగస్త్య మహాముని వద్దకు వచ్చి ఆయనను అర్చించి వెళ్తూ ఉంటారు. ఆయన అతిథి సేవలు అందుకుంటూ ఉంటారు" అని బదులిచ్చాడు శ్రీరాముడు.
"మరి వీరిలో శివుని స్థానం ఎక్కడా లేదే ? శివుడు ఇటకు అరుదెంచడా ?" అన్న ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వుతో శ్రీరాముడు "చూస్తూ ఉండు నాయనా ! చక్కగా అర్ధమౌతుంది" అన్నాడు.
అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి "వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, దశరధపుత్రాయ, రామవర్మ వ్యావహారిక నామమధేయస్య, అహంభో అభివాదయే" అంటూ అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ, లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యంలో ఉన్నాననీ, అది పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నాడు . కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు " రామచంద్రా ! నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలోకి ఎందువలన వెళ్ళానో తెలుసా ? వనవాసమున ఉన్నవారు ముందుగా వైశ్వదేవాది అగ్నికార్యాలు ఆచరించ వలెను. అగ్నికార్యం చేస్తుండగా అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు." అని వివరించాడు.
"శ్రీరామా! నువ్వు లోకములన్నిటిని పాలించు ప్రభువువు. ఇవ్వాళ నాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను " అని రాముడికి వానప్రస్థులకి పెట్టే భోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మ ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, "వీటి ద్వారా జయాన్ని పొందు" అని ఆశీర్వదించారు.
"శ్రీరామా ! మరొక్కమారు నిన్ను కలవాలని అనిపిస్తున్నది. కాలక్రమంలో అది జరుగుతుందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పావన గోదావరీ తీరాన ఉన్న పంచవటి వద్ద నివాసం ఏర్పరుచుకోండి" అని చెప్పాడాయన.
"ధన్యుడిని మహామునీ ! మీయొక్క ఆశీస్సులు మాకు సర్వవేళలా రక్షిస్తుంటాయి. మాకు శెలవు దయచేయగా వేడుకొంటున్నాను." అని వినయంగా మరొక మారు నమస్కరించి ఆశ్రమం వీడాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ, లక్ష్మణుడు అనుసరించగా.
ఏదో లోకంలో విహరిస్తున్నట్లు నడుస్తున్న లక్ష్మణుని చూసి పరిహాసంగా "తమ్ముడూ ! పరాకున దారి తప్పేవు. ఏమిటో ఆ ఊహాలోకాల్లో ఆలోచనలు ?" అన్నాడు.
"అన్నయ్యా ! శివుని స్థానం కనిపించలేదు, అగస్త్య మహర్షి శివుని పూజించడు, ఆయనను పట్టించుకోడు అని దురూహకు గురి అయ్యాను.'
"మరి ఇప్పుడు ఏమి తెలుసుకున్నావు ?"
"అన్నయ్యా ! నమ్ముతావో లేదో ! నీకు అర్ఘ్య పాద్యాలతో అర్చిస్తున్నపుడు అగస్త్య మహాముని కనిపించలేదు. ఆ పరమశివుడే కనిపించాడు. అగస్త్యులవారు సాక్షాత్తు మహాదేవుని అంశ అని తెలుసుకున్నాను. నాకు అంతకు ముందు ఉన్న శంక పటాపంచలు అయిపోయినాయి " అన్నాడు లక్ష్మణుడు తన్మయంతో.
శ్రీరాముడు, సీతమ్మ మందహాసం తో తల పంకించారు.
(ఈ చివరి రామ లక్ష్మణ సంభాషణ కేవలం నా మనస్సు లో కదిలిన ఊహ ! మహర్షి వ్రాసినది కాదు !)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి