ఒక హత్య కధ@
ఒక హత్య కధ
పట్టాభిరామయ్య ఇంట్లో ఆయన, భార్య శారద, కొడుకు ఆనందు, కోడలు లీల, మనవడు సుమంత్ ఉంటారు. కూతురు అనిత పెళ్ళై భర్తతో పక్క వీధిలోనే కాపురం.
వీరితో పాటు లీల పినతల్లి కొడుకు చైతన్య చుట్టపు చూపుగా వచ్చి రెండు రోజులుగా ఉన్నాడు. ఆ మరునాడు హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెల్లెలికి, బావగారికి చెప్పాడు.
తెల్లవారేసరికి ఆ కుటుంబ సభ్యులందరి మధ్య ఓ శవం.
దిగ్భ్రాంతితో, భయంతో, ఆందోళనతో, దిక్కుతోచక ఒకరివంక ఒకరు కంగారుగా చూసుకుంటూ, నోట మాట రాక వణికిపోతూ ఆ శవం చుట్టూ నిలుచున్నారు వారంతా.
ఆ శవం ఆడమనిషి ది. పైన బట్టలన్నీ ఎక్కడా చెదరలేదు. నిద్రపోతోందా అని అనిపిస్తుంది యథాలాపంగా చూస్తే ! జాగ్రత్తగా చూస్తే నోటి నుంచి ఎడమ బుగ్గ మీదకు కారిన సన్నటి నెత్తురు చార భయం కొలుపుతోంది. ఇంకా దగ్గరగా చూస్తే కళ్ళు కొంచెమే మూసుకుని ఉండి, ఎర్రటి చుక్కలు తెల్ల గుడ్డు మీద కనిపిస్తున్నాయి.
ఆ మనిషి ఆ ఇంట్లో పని మనిషి కుమారి ! దాదాపు 25 ఏళ్ళ వయసు ఉంటుంది. చిలోపొలోమని నవ్వుతూ ముప్పావు గంట నుంచి గంట లోపు ఇంటి పనులన్నీ చక్కబెట్టేసి తుర్రుమంటుంది. సాయంత్రం మళ్ళీ అరగంట లోపు పనులు అవగొట్టేసి అక్కడే మొహం కడిగేసుకుని, తన బ్యాగ్ లోనుండి చిన్న పౌడర్ డబ్బా తీసి రాసేసుకుని దోసగింజ షేప్ లో తిలకం దిద్దుకుని కూర్చునేది. వాళ్ళ ఆయన అటెండర్ గా పని చేస్తున్న ఆఫీసు నుంచి ఆరు గంటలకల్లా ఠంచన్ గా మోపెడ్ మీద వచ్చేసేవాడు. అతను తీసుకొచ్చిన పూల దండ పెట్టుకుని వెనకాల ఎక్కి కూర్చునేది. చక్కటి జంట అనుకునేవాళ్లు అత్తా కోడళ్ళు.
అసలు కుమారి శరీరం అక్కడకి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు దాదాపు అందరికీ. రాత్రి జాగ్రత్తగా తాళాలు వేసుకుంటారు. ఎప్పుడైనా భర్త ఊరు వెళ్ళినప్పుడు కానీ,
పట్టాభిరామయ్య గారు కుటుంబం తో వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆమె ఆ ఇంట్లో పడుకోవడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
అందరికన్నా ముందు తేరుకుంది చైతన్య. జాగ్రత్తగా ఎవరినీ కళేబరాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించి చుట్టూరా తిరిగి జాగ్రత్తగా పరిశీలించాడు. తనలో తాను మాట్లాడుకున్నట్లు పైకే తన ఆలోచనలు చెప్పుకుంటున్నాడు.
"శరీరం బిగుసుకున్నట్లుగా అనిపిస్తోంది. అంటే చనిపోయి ఆరు గంటల పైనే అయి ఉండచ్చు. మెడ చుట్టూ సన్నటి చార కమిలినట్లు కనిపిస్తోంది. మెడకి ఎదో చుట్టి బిగించి ఉండాలి. పెద్దగా బట్టలు నలిగినట్లు, పెనుగులాట జరిగినట్లు లేదు. బాగా తెలిసిన వాళ్ళే హత్య చేసి ఉండాలి".
"హత్యా ?" అని దాదాపుగా ఒకే సమయం లో అత్తా కోడళ్ళు కీచుగా అరిచారు. పట్టాభిరామయ్య కూడా ఉలిక్కిపడి "హత్య అంటావా చైతన్యా ?" అనడిగాడు తడారిపోతున్న గొంతుకతో .
"అలాగే అనిపిస్తోంది , మామయ్య గారూ. ఇది మన చేతిలో లేదు. పోలీసులకి రిపోర్ట్ చెయ్యాలి."
"నో !" అని దాదాపు అరిచినంత పని చేశారు పట్టాభిరామయ్య, ఆనందు.
యధాలాపంగా మేనల్లుడి వైపు చూసిన చైతన్య, సుమంతు మొహంలో కత్తివేటుకి నెత్తురు లేనట్లు ఉన్న విషయం గమనించి చటుక్కున వాణ్ని దగ్గరకి తీసుకుని "ఏమీ భయపడకురా బాబూ " అని బుజ్జగించాడు. పదహారేళ్లు వచ్చినా ఆ దృశ్యం చూసేసరికి సుమంత్ ఒళ్ళు చెమటతో నిండిపోయి మనిషి వొణికి పోతున్నాడు.
"అంతకన్నా వేరే దారి లేదా చైతన్యా ? ఎదో విధంగా దీనిని మనం దాటిరాలేమా ?" అన్నాడు అనంత్.
"బావ గారూ ! మనం దీనిని కప్పెట్టే ప్రయత్నం చేస్తే మనని దోషులు క్రింద జమ కడతారు" అని. తన జేబులోని మొబైల్ తీసి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసాడు చైతన్య.
*******
పోలీసులు వచ్చాక పంచనామా వగైరాలు పూర్తి చేసుకుని బాడీని పోస్ట్ మోర్టమ్ కి పంపిన తర్వాత ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరినీ ఇంటరాగేట్ చెయ్యడం మొదలెట్టాడు.
అసలు కుమారి ఇంట్లోకి ఎలా వచ్చింది ? బ్రతికి ఉండగానే వచ్చిందా ? లేక చనిపోయిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చి వీరి ఇంట్లో పెట్టేసి వెళ్లిపోయారా అన్న పాయింట్ ముందు తేలాలి అన్న దారిలో.మొదలెట్టారు. అది త్వరలోనే తేలిపోయింది.
కోడలు లీల ఇంటరాగేషన్ లో చెప్పింది : రాత్రి దాదాపు అందరూ నిద్ర పోయాక కుమారి వచ్చిందనీ, భర్త అర్జంటుగా అప్పడికప్పుడు ఫోన్ వచ్చి వైజాగ్ కారు మాట్లాడుకుని వెళ్ళాడనీ, ఇంట్లో ఒంటరిగా ఉన్నాననీ, మర్నాడు ఉదయం పనులు చూసుకుని వెళ్ళిపోతాననీ అనడంతో అప్పుడప్పుడు ఇది అలవాటే అవడంతో ఆమెను లోపలకి రమ్మని తలుపులు వేసుకున్నానని చెప్పింది.
ఆమె భర్తకి కబురు చేశారా ? అని ఇన్స్పెక్టర్ అడిగితే, చేశామనీ, లబోదిమంటూ రాజమండ్రి దాకా వెళ్లిన వాడు వెనక్కి వచ్చేస్తున్నాడని పట్టాభిరామయ్య చెప్పాడు.
తర్వాత మిగిలిన వారిని ప్రశ్నించి మరికొన్ని వివరాలు రాబట్టాడు ఇన్స్పెక్టర్. కుమారికి పెళ్ళై సంవత్సరాలైంది. పట్టాభిరామయ్య ఇంట్లో చేస్తుండగానే కుదిరి, ఆ ఊళ్ళోనే పనిచేస్తున్న దుర్గారావు తో పెళ్లయ్యింది. ఇంకా పిల్లలు లేరు. అన్యోన్యంగానే ఉంటారు. ఎవరితో కూడా పెద్ద గొడవలూ లేవు.
పట్టాభిరామయ్య ఇంట్లో కాక ఇంకొక రెండు ఇళ్లలో పాచి పని పట్టాభిరామయ్య కూతురు అనిత ఇంట్లోనే కాకుండా వాళ్ళు ఉండే ఇంటి ఓనర్ల ఇంట్లో కూడా చేస్తూ ఉంటుంది. వాళ్లకి పెద్ద ఆర్ధిక సమస్యలు, అప్పులు ఇవేమీ లేవు. చుట్టాలు కూడా దూరపు ఊళ్లలో ఉంటారు.
చైతన్య తాను ఊరు వెళ్లడం వాయిదా వేసుకుని చెల్లాయితో ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ కూడా ఇది తేలేవరకూ అక్కడే ఉండమని చెప్పాడు. చైతన్య కూడా తనకి ఉత్సుకత ఉండడం వల్లనూ, తన చెల్లెలు మామ గారికి మోరల్ సపోర్ట్ గా ఉండడానికి అక్కడే ఉండిపోయాడు.
రెండు రోజుల తర్వాత చైతన్య ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మాట్లాడాడు.
పట్టాభిరామయ్య తో :
"మీరు కుమారి మొగుడితో మొన్న ఎపుడో గొడవ పడ్డారట నిజమేనా మామయ్యా గారూ ?"
కొంచెం ఉలికిపాటుతో "అది నీకు ఎవరు చెప్పారు?" ఎదురడిగారాయన.
"దుర్గారావే ఇన్స్పెక్టర్ తో అంటుంటే విన్నాను. ఏమైంది అసలు ?"
"దుర్గారావు, కారు కొనుక్కుని టాక్సి కింద తిప్పుదామని నన్ను కూడా పెట్టుబడి పెట్టమని, లాభాలు పంచుకుందామని అంటే సరే అన్నాను. ఆలోచించగా అది రిస్కు తో కూడిన పని అనిపించి నా వల్ల కాదని అన్నాను. వాడికి కోపం వచ్చింది. అడ్వాన్స్ కూడా ఇచ్చాను, ఇప్పుడు కాదంటే ఎలా ? అని మీద మీదకి వచ్చాడు. నేను కోపం వచ్చి వాడిని తోసేసాను. నన్ను అనరాని మాటలు అని బెదిరించి వెళ్ళాడు" అన్నాడు పట్టాభిరామయ్య నిట్టూర్చి.
"ఏమని అన్నాడు ?"
"అవన్నీ ఎందుకులే ! వదిలెయ్యి"
"అలా కాదు మామయ్యా ! సరిగ్గా ఏమైందో తెలిస్తే హంతకుణ్ణి తేలికగా పట్టుకోవచ్చు " అన్నాడు చైతన్య తన చెల్లాయి మామగారిని నిశితంగా పరిశీలిస్తూ.
"నువ్వు కోలుకోలేని దెబ్బ తీస్తాను అన్నాడు" అన్నాడు పట్టాభి రామయ్య .
"అందుకని ముందే వాడిని దెబ్బతీయడానికి నిశ్చయించుకున్నారు కదూ మామయ్యా ?"
"నో ! కుమారిని నేను చంపలేదు చైతన్యా !"
" మీరు చంపారని నేననలేదే ? దెబ్బ తీయాలనుకున్నారని అన్నాను అంతే !"
తడబడుతూ అక్కడనుంచీ గబగబా వెళ్ళిపోయాడు పట్టాభిరామయ్య.
కొంచెం సేపు ఆగాక బావగారు ఆనంద్ ని కదలేశాడు చైతన్య.
"బావగారూ ! ఇక్కడ ఆర్ ఎస్ బ్రదర్స్ య లో పగడం చోకర్, ఇయర్ హాంగింగ్స్ సెట్స్ దొరుకుతాయి అని విన్నాను, మనకి డిస్కౌంట్ లో ఇస్తాడంటారా ? ఓరగా ఆనంద్ ని చూస్తూ ప్రశ్నించాడు.
చిన్నగా ఉలిక్కిపడి, అది గబుక్కున కప్పి పుచ్చుకోవడానికి గట్టిగా నవ్వేశాడు ఆనంద్. "ఏంటోయ్ బామ్మర్దీ ! హత్య కేసులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే నగల హడావుడి ఏమిటోయ్ ?"
"నిన్న పోలీసులు రోటీన్ గా కుమారి వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తోంటే కొంచెం కాస్ట్లీ ఆభరణం కనిపించింది, నేను చెప్పానే ? అదే ! దాని బాక్స్ లో ఆర్ ఎస్ బ్రదర్స్ రసీదు, దాని మీద ఆనంద్ అన్ని పేరు ఉన్నాయి !" అన్నాడు చైతన్య ఈ సారి తన అనుమానపు చూపుని దాచుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా.
***
పావు గంట తరువాత ఆనంద్ దగ్గర నుంచి వచ్చాక సాలోచనగా వంటింటి వైపు నడిచాడు. చెల్లెలు, అత్తగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని లోగొంతుకలో మాట్లాడుకుంటున్న వారు చైతన్యని చూసి ఆపేసారు.
అదేమీ పట్టించుకోకుండా "లీలా ! ఈ పూట వంట ఏమిటీ ?" అని అడిగాడు.
"ఒరేయ్ ! నీ డొంక తిరుగుడు ఆపి నువ్వు బావగారితో చాలా సేపే మాట్లాడినట్లున్నది ? ఏమిటి విశేషం ?"
"మరేం లేదే ! నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని నీకు తెలుసు కదా ! తాంబూలాలప్పుడు ఎదో నగ పెట్టాలి కదా నా భార్యకి. పగడపు చోకర్ అయితే బాగుంటుందని అనిపించి బావగారిని వివరాలడుగుతున్నాను."
చెళ్ళున కొట్టినట్లుగా ఉలిక్కిపడింది లీల. అత్తగారికి కూడా మొహం ముందు ఎర్రబడిపోయి వెంటనే పాలిపోయింది.
****
భోజనాలు అయ్యాక చైతన్య మేనల్లుడితో "సుమంతూ ! రాత్రికి సినిమాకి వెళదాం వస్తావా ? జస్ట్ కంపెనీకి.?"
సుమంత్ "లేదు మామయ్యా ! మా ఫ్రెండ్స్ అందరమూ సినిమా ప్లాన్ చేసుకున్నాము. రేపు వెల్దామా ?"
"సరే నీ ఇష్టం "
రాత్రి అందరూ నిద్ర పోయాక చైతన్య చప్పుడు చెయ్యకుండా సుమంత్ స్టడీ రూమ్ లోకి వెళ్లి శబ్దం రాకుండా తలుపులు మూసేసి సుమంత్ ల్యాప్ టాప్ తెరిచాడు.
సుమంత్ ఆ ఏడాదే ఇంనీరింగ్ కంప్యూటర్స్ లో చేరినా మంచి పట్టున్న వాడే అని ఐదు నిముషాలలోనే అర్ధమైపోయింది చైతన్యకి. అకౌంట్ హ్యాక్ చెయ్యకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
కానీ చైతన్య అనుభవమున్న చేతులు చకచకా కీ బోర్డు మీద కదిలాయి. ఐదు నిముషాలలో ఆ కంప్యూటర్ కీ చైతన్యకీ దోస్తీ కుదిరిపోయింది. అతనేం అడిగితె అది చకచకా చేసేసింది.
ఒక అరగంట అయ్యేసరికి తనకి కావలసిన సమాచారం అంతా సేకరించుకుని అంతే నిశ్శబ్దంగా బయటకి వచ్చేసి పడుకుండిపోయాడు చైతన్య.
కంప్యూటర్ మూసేసి ముందు తాను బ్రౌజ్ చేసిన హిస్టరీ ని డిలీట్ చెయ్యడం మర్చిపోలేదతడు.
****
మరునాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇన్స్పెక్టర్ ముందుగా ఫోన్ చేసి వచ్చాడు. ఆ కుటుంబసభ్యులకు అందరికీ గుండెలు దడదడలాడుతూనే ఉన్నాయి. ఏం వార్త చెబుతాడో, ఎవరిని అరెస్టు చేయాలని అంటాడో అని ఎవరికి వాళ్ళు మనసులో అందరు దేవుళ్ళకీ మొక్కుతూనే ఉన్నారు.
"ముందుగా మీ అందరికీ ఒక చిన్న నిజం చెప్పబోతున్నాను. ఎవరికీ తెలియకుండా ఉంచుదామనుకున్నాను, కానీ తనే చెప్పమని అనుమతి ఇచ్చాడు. అతనే చైతన్య. తను నాకు హైస్కూల్ నుంచి క్లాస్ మేట్.
అంతే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కి అనుబంధంగా ఉండే బ్యాక్ రూమ్ డివిజన్ లో ఎనలిస్టు, సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్. అతను ఈ హత్య జరిగిన సమయంలో ఇక్కడ ఉండడం యాదృచ్ఛికంగా జరిగినా మాకు అత్యంత వేగంగా ఈ నేరాన్ని ఛేదించడంలో కీలకమైన పాత్ర పోషించాడు."
అందరూ నిర్ఘాంతపోయి నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు.
"ఈ కేసులో మలుపులని తానే చెప్పడం బాగుంటుందనిపించింది. అందుకనే పోలీసు స్టేషన్ కి పిలవకుండా నేనే పర్సనల్ గా వచ్చాను. కొన్ని సున్నితమైన అంశాలు స్టేషన్లో అందరి ముందూ చెప్పడం బాగుండదు. అది ఇంకొక కారణం."
ఒక్కొక్కళ్ళూ నోళ్ళు మూసి బుద్ధిమంతులలాగ వినడం మొదలెట్టారు.
"ముందుగా నాకు మీ మీద అనుమానం కలగలేదు. దానికి కారణం మీరు నా దగ్గిర వారవడం ఒక కారణం, రెండోది హత్య మీలో ఎవరైనా చేస్తే శవాన్ని ఇక్కడే పెట్టుకోరు. కానీ నా అనుమానపు మనసు ఆ అవకాశాన్నీ వదల వద్దని హెచ్చరించింది.
హత్య జరిగిన మర్నాడు కుమారి భర్త దుర్గా రావుని వాళ్ళ ఇంట్లోనూ, స్టేషన్ కి పిలిచీ ఇంటరాగేషన్ చేసినపుడు కొన్ని నిజాలు బయటపెట్టాడు. ముందు మామయ్య గారు ఏదో బిజినెస్ విషయంలో గొడవపడ్డారనీ, 'నీ అంతు చూస్తా'నని అన్నారని చెప్పాడు.
'ఆ మాట అన్నాను నిజమే ! వాడు ఇంకా అసహ్యంగా మాట్లాడేసరికి కొంచెం తొందరపడి అన్నాను. కానీ ఆ విషయం మీద హత్య చేసేంత కసాయి వాడిని కాదు."
చైతన్య బావగారి వైపు తిరిగాడు "మీరు కుమారికి పగడపు చోకర్ సెట్ ఇవ్వడం అబద్ధమా బావగారూ ?"
"అది నేను ఒక బలహీన క్షణంలో తొందర పడ్డమాట నిజం ! మీ చెల్లాయి మా అత్తగారింటికి కాకినాడ వెళ్ళినపుడు కుమారి హొయలు పోతూ గారాబంగా అడిగేసరికి కొన్నాను. బస్ ! అంతే వరకే ! నేనేమీ తప్పు చెయ్యలేదు."
బావగారికేసి ఒక నిముషం తదేకంగా చూసి తన చెల్లెలు, అత్తగారి వంక దృష్టి మరలించాడు.
అత్తగారు తడబడే గొంతుకతో "నీ బావగారి నిర్వాకం నాకూ, నీ చెల్లాయి కీ ఒకేసారి తెలిసింది. ఇద్దరమూ ఒకరినొకరం ఓదార్చుకున్నాం. పనిలోనుంచి తీసేద్దామనీ అనుకున్నాం. మీ మామయ్య గారికి ఏ కారణం చెప్పాలో తోచక వాయిదా వేసుకున్నాం. దానిని ఏ రకంగా ఆరడి పెట్టాలా అని కూడా ఆలోచించాం. కానీ చంపెయ్యాలన్నంత కోపం మా ఆలోచనలో కూడా రాలేదు'
మిగిలిన ఒక్క వ్యక్తి సుమంత్ వైపు తిరిగాడు చైతన్య.
సుమంత్ "ఏమిటి నన్ను కూడా లిస్టులో వేశావా మామయ్యా!" అన్నాడు నవ్వు ఏడుపు కలిసిన గొంతుకతో.
"నీ మీద అనుమానపడక పోదునురా ! నువు మీ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిన రోజున నీ ల్యాప్ టాప్ ను పరిశీలించాను." అన్నాడు చైతన్య.
సింహం అకస్మాత్తుగా ఎదురుపడితే ఎలా రియాక్ట్ అవుతాడో అలాగ స్టన్ అయిపోయాడు సుమంత్.
"నా సైబర్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించానులే. నీ లాప్ టాప్ లో ఉన్న బ్లూ ఫిల్ములు, ఫొటోలూ నా కంట పడ్డాయి. వాటిలోనే వేరే ఫోల్డర్ లో కుమారి ఫోటోలూ ఉన్నాయి."
మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు సుమంత్. హత్య జరిగిన రోజు వణికిపోయినట్లు వణికిపోయాడు.
"ఆ రోజు కుమారి పడుకోవడానికి వచ్చిన రోజున అనుకోకుండా ఆమె నగ్న ఫోటోలూ, పోర్న్ సినిమాలూ చూడడం గమనించి నిన్ను నిలదీసింది కదూ ? ఆమె గొడవ చేస్తుందేమోనని కంప్యూటర్ మౌస్ కార్డ్ తో గొంతుకి బిగించి చంపేశావు కదూ ?"
సుమంత్ ఏడవడం మొదలుపెట్టాడు.
"మామయ్యా ! చంపాలని అనుకోలేదు మామయ్యా ! అరవకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఆ వైరు గొంతుకి చుట్టాను. చచ్చిపోతుందనుకోలేదు. భయం వేసి వెనకాల వసారా లోకి లాక్కువెళ్ళి బట్ట జాగ్రత్తగా సర్దిపెట్టి నా రూమ్ లోకి పారిపోయి తలుపులు వేసేసుకున్నాను మామయ్యా ! నాకు ఉరి శిక్ష వేస్తారా మామయ్యా ? ఎలాగోలాగ రక్షించు మామయ్యా!" అని గోలగోల గా ఏడ్చేస్తున్న సుమంత్ ని చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు వారంతా !
****
నాలుగు నెలల తర్వాత ఇన్ కెమేరా పద్ధతిలో విచారించిన జడ్జీ, సుమంత్ మైనర్ కాబట్టి, అంతకు ముందు నేర చరిత్ర లేదు కాబట్టి, పధకం ప్రకారం చేసిన హత్య కాదు కాబట్టి, విచారణ సమయంలో నిజమైన పశ్చాత్తాపం వెలిబుచ్చడం పరిగణనలోకి తీసుకుని మూడేళ్ళ జైలు శిక్ష విధించి, కరెక్షన్ స్కూల్ కి పంపించాడు.
సమాప్తం

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి