దాగిన ప్రతిభ@
దాగిన ప్రతిభ "సో ! మై డియర్ స్టూడెంట్స్ ! మానవ శరీర శాస్త్రం ఇవాళ పూర్తి చేశాం. ఇంగ్లీష్ భాష, యాక్సెంట్ ఎలా మాస్టర్ చెయ్యాలన్నది విశ్వం మాష్టారు చెప్పారు కదా ? రేపు మీరంతా ఇవాళ్టి చాప్టర్ మీద పరీక్షకి తయారవ్వండి. మీరందరూ మెరికల్లాంటి వాళ్ళు. ఇంత వరకూ పెట్టిన పరీక్షలు అన్నీ చాలా బాగా వ్రాశారు దాదాపు అందరూ. ఎల్లుండి మార్క్ లు ఇచ్చాక ఈ ఇన్స్టిట్యూట్ తో నా ఒప్పందం పూర్తి అవుతుంది. ఆల్ ది బెస్ట్ రేపటి పరీక్షకి !" ఒకటే క్షణం తర్వాత ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ అందరూ చప్పట్లు కొట్టారు. చిరునవ్వుతో బయటికి వచ్చాడు డాక్టర్ శివరామ్. చప్పట్లు విని తన గదిలోనుంచి బయటకు వచ్చిన ప్రిన్సిపాల్ "డాక్టర్ గారూ ! ఇవాళ్టి తో మొత్తం సిలబస్ పూర్తి అయిపోయిందా ?" అని అడిగారు. "అవును రావుగారూ ! అదే హడావుడి !" అన్నాడు శివరామ్ క్లాస్ రూమ్ వైపు చూస్తూ. "సరే డాక్టర్ గారూ ! మీరు బయల్దేరండి, సాయంత్రం ఓపీ కి టైమ్ అవుతున్నట్లుంది మీకు !" అన్నాడు రావు గారు. శివరామ్ మెట్లు దిగి తన స్కూటర్ మీద బయల్దేరగానే ఆ క్లాస్ రూమ్ లోకి నడిచాడు రావు గారు. ********* ********** మెడికల్ ...