అమ్మ చేతి ముద్ద@
అమ్మ చేతి ముద్ద
“ నేను వాడు 1వతరగతి నుండి కలసి చదువుకున్నాము
మా నాన్న ఆఫీసరువాడి నాన్న ఇళ్లలో పూజలు పునస్కారాలు చేయించే బ్రాహ్మణుడు. పైగా సంతానము ఎక్కువ రాబడి తక్కువ
నా ప్రండ్ ఇంట్లో పెద్దవాడు. వాడికి ఆకలి ఎక్కువ
తల్లి భర్త ఏమైనా ఒకటి రెండు రూపాయలు తెస్తే ఆపూటకి ఆఇంట్లో వంట అయ్యేది. అదైనా కూర అరుదుగా చేసుకునేవారువాళ్లింట్లో ఎక్కువ పెసరపచ్చడే చేసుకునేవారు
అది చూస్తూనే వాడు ఏడ్చేవాడు.
మా ఇంట్లో 3,4 పప్పు కూర పచ్చడి పులుసు కాని రసము కాని అమ్మ చేసేది. దానికి తోడు గడ్జపెరుగు ఎప్పుడైన వాణ్ణి ఇంటికి భోజనానికి తీసుకుని వచ్చేవాణ్ణి. కరివేపాకు కూడ మిగలకుండా పెట్టినదంతా తినేవాడు.
నేను సగం తిని తిన్నట్టు తిని పారేసేవాణ్ణి. వాడు తృప్తిగ తిని "అమ్మగారు మీరు చాలా బాగా వండుతారండి" అనేవాడు సంతోషముగా
మేము అలాగే ఫ్రండ్షిప్ maintain చేస్తున్నాము
సడన్ గా నాన్నకి ప్రమోషన్ ట్రాన్ఫరు వచ్చింది హైదరాబాద్ కి
మేము వెళ్లే రోజు నేను వాడు ఎంతో ఏడ్చాము. ఇద్దరిది ఏడేళ్ల ఫ్రెండ్ షిప్ మరి.
హైదరాబాద్లో నా చదువు పూర్తి అయి బ్యాంక్ లో జాయిన్ అయ్యాను . పెళ్లి కూడ అయింది
కాని నా చిన్నప్పటి ఫ్రండుని మరచిపోలేకపోయాను
వాణ్ణి తలచుకున్నప్పడల్లా మనస్సు ఏదోలా అయిపోయేది
***** ******** ****
మా బావమరిది పెళ్ళి అకస్మాత్తుగా కుదిరి ఐదు రోజులలో ముహూర్తం. ముఖ్యమైన పనులన్నీ ఒదులుకుని సతీసమేతంగా ఫ్లైట్ లో వైజాగ్ చేరుకున్నాను. మామగారు రాజమండ్రి నుండి రెండు బస్సులలో దిగారు. సమయం తక్కువ ఉండేసరికి మండపాలు దొరక్క పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి ఎదురుగా పెద్ద ఖాళీ స్థలంలో పందిళ్ళు వేసి పెళ్ళి చేశారు. పెళ్ళికూతురి తండ్రి మధ్య తరగతి వాడే అయినా ఉన్నంతలో బాగా చేశారు. ముఖ్యంగా భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. మా మాంగారు కొంచెం కోపధారి, అయినా ఆ భోజనాల రుచికి, ముఖ్యంగా ఆ వడ్డన పద్ధతికి ఆయన పూర్తిగా ఫిదా అయిపోయారు. ప్రతి వారి దగ్గరకు అన్ని ఆధరువులు వారికోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు అడిగి, కొసరి కొసరి వడ్డించారు ఆ వడ్డన చేసిన వారు.
చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉండేసరికి మగపెళ్ళి వారు చాలా సంతృప్తి పడ్డారు. మర్యాదలు కూడా ఎక్కడా లోపం లేకపోయే సరికి పెళ్ళి సంబరాలన్నీ ధూమ్ ధామ్ గా జరిగిపోయాయి.
మా మామగారు వియ్యంకుడిని దగ్గరకు పిలిచి వంటవారి గురించి ప్రత్యేకంగా వాకబు చేశారు. ఆ వంటమేస్త్రీ కి ఆ చుట్టుపక్కలే కాక చాలా దూరప్రదేశాలలో కూడా మంచి పేరున్నదనీ కానీ ఆయన కొంతమంది పనులే ఒప్పుకుంటారని కూడా చెప్పారాయన.
వంటవారు వెళ్ళిపోయే ముందు వంటకట్నం కోసం వచ్చినపుడు నేను, మా మామగారు పక్కనే ఉన్నాము. ఆశ్చర్యకరంగా మా మామగారు వెయ్యి నూటపదహార్లు వారికి ముట్టచెప్పి చాలా మెచ్చుకుని, "మీ మేస్త్రీ గారిని చూడాలి ఒకసారి పిలుస్తారా ?" అని అడిగారు. ఆ మేస్త్రీని ఎక్కడో చూసినట్టు అనిపించి "మీది ఈ ఊరేనా ?" అని వాకబు చేశాను. నన్ను అప్పుడే పూర్తిగా పరిశీలించిన ఆయన చటుక్కున వాటేసుకున్నాడు. "నన్ను గుర్తు పట్టలేదా ? నేను నువ్వు ఏలూరు లో కలిసి చదువుకున్నాం" ఈ సారి బిగియారా కౌగలించుకోవడం నా వంతు అయింది. ఒక గంటసేపు నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పుకున్నాం.
తను మేము హైదరాబాదు వెళ్ళి పోయాక కొంతకాలం పౌరోహిత్యం చేసి, ఆ తర్వాత వంటమేస్త్రీ గా సెటిల్ అయాడుట. మిగిలిన వారిలాగ కాకుండా శ్రద్ధతో వంటలు చెయ్యడం, వడ్డన చేసేటపుడు అందరికీ పేరుపేరునా ప్రత్యేకంగా వడ్డించడంతో అతని పేరు త్వరగానే పాకిపోయింది.
"నాకు ఈ రీతి అలవాటు మీ అమ్మ గారి దగ్గర నుంచే వచ్చింది. ఆవిడ నా ఆకలెరిగి మళ్ళీ మళ్ళీ వడ్డించడం నేను జన్మలో మర్చిపోను. ఈ నా ఉన్నత స్థితికి ఆవిడే కారణం !" అని కంట నీరు కారుతుండగా గద్గదంగా చెప్పాడు. "హైదరాబాద్ వచ్చినపుడు ఆవిడను తప్పకుండా చూస్తాను. ఆవిడ చేతి ముద్ద మళ్ళీ తింటాను" అని కళ్ళు మెరుస్తుండగా సంబరంగా చెప్పాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి