పోస్ట్‌లు

బంధులబ్ధి @

 బంధులబ్ధి  స్వరూప, సుప్రియ, సుప్రియ తమ్ముడు షణ్ముఖ బస్ దిగి చుట్టూ చూశారు. ముదినేపల్లి బస్ స్టేషన్ లో జనాలు పెద్దగా లేరు కానీ అలాగని పూర్తిగా ఖాళీగా కూడా లేదు. బయటికి వచ్చి పుట్ల చెరువు కి ఆటో మాట్లాడుకుని ఎక్కేశారు. ఆటో అతను వీళ్ళ వాలకం గమనించి "శర్మ గారి ఇంట్లో పెళ్ళికా పాపలూ !" అనడీగాడు. అవును మీకెలా తెలిసిందీ? అనడిగింది స్వరూప. ఈ టయం లో ఆ ఊరికి వెళ్ళే వారు ఆరింట పెళ్ళికే వస్తున్నారండీ ! నేను ఆయన ఇంటి పక్కనే లెండి ఉండేది. అన్నాడతడు. ఈ పాటికి పెళ్ళికూతురిని చేసేసి ఉంటారే ! మన మీద ఫైరవుతుందో ఏమిటో ! వారిద్దరూ భయపడ్డట్టే శ్రీ విద్య వీళ్ళని చూస్తూనే చిరుకోపంతో మొహం తిప్పుకుంది. "నిన్నరాత్రి వస్తారనుకుంటే ఇప్పుడా రావడం ? తలంబ్రాల వేళకి రావలసింది" అన్నది బుంగమూతి పెడుతూ. "ఏం చెయ్యమంటావే ? కాకినాడ నుంచి వస్తున్నామా ? గుడివాడలో మా మేనత్త ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న పేకవారబ్బాయితో పెళ్లి చేస్తానన్నారు !" అన్నది స్వరూప. "మీ మేనత్త గారి ఇంటి పేరు పేరివారు కదా ?" అన్నది శ్రీవిద్య కొంటెగా ! "హమ్మయ్య ! కోపం తగ్గిందా తల్లీ ? జగజ్జననీ ! మా మేనత్త కొడుకున...

చిన్న పాత్రలతో రామాయణం -. శతానందుడు

  కళ్యాణం కమనీయం రాజ ప్రాసాదం లో అడుగిడిన రాజపురోహితుడు శతానందుల వారికి జనక రాజర్షి ఎదురేగి శిరసు వంచి అభివాదం చేసాడు. రెండు చేతులూ ఎత్తి స్వస్తివాచకాలు పలికారు శతానందుల వారు. "స్వామీ ! ఈ రోజు ఎదో తెలియని ఆనందం, ఉత్సాహం వెల్లి విరుస్తున్నది నాలో ! పదే పదే కుడి కన్ను, కుడి భుజమూ అదురుతున్నవి. నా చిరకాల వాంఛ నెరవేరుతుందని అనిపిస్తున్నది !" చిరునవ్వుతో "శుభం భూయాత్ !" అని పలికారు రాజ పురోహితుడు. "మహా రాజా ! నేను వచ్చే మార్గంలో కూడా జనులలో ఉత్సాహం గమనించాను ! బయట ప్రకృతి కూడా చల్లని తల్లి వలె ప్రజలను సేదతీరుస్తున్నది." అన్నాడాయన. "సభకి వెళదాము రండి" అని దారి తీశారు జనకుల వారు. ********* విశాలమైన ప్రాంగణంలో సభ మొదలైన కొద్ది సేపటికే దౌవారికుడు ప్రవేశించి మహారాజుకి అభివాదం చేసి "జయము జయము మహారాజా ! మహా తేజస్వి, యశోధనుడు, విశ్వామిత్ర బ్రహ్మర్షి ఏతెంచినారు. వారివెంట ఇద్దరు రాజకుమారులు కూడా ఉన్నారు. మహారాజుల అనుమతి అయితే ప్రవేశపెట్టగలను" అన్నాడు. "అత్యానందం కలిగించే బ్రహ్మర్షి రాక తెలిసి కూడా వారిని ప్రతీక్షింప జేయ తగునా ? నేనే అక్కడకి వచ...

తీరిన పగ@

తీరిన పగ కళ్ళు మసకలు కమ్ముతుండగా పీలగా ఆ గొంతు నుంచి వచ్చిన మాట : "ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా ఊహించలేదు ". ఆ వెంటనే స్పృహ తప్పిపోయింది ! ****** ఆనంద్ చెన్నై టీ సీ యస్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా రెండు నెలల క్రితమే చేరాడు. సులోచనారాణి హీరో రాజశేఖరం అంత కాకపోయినా నదరుగానే ఉంటాడు. తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే గతించడంవలన ఒక్కడే ఉంటూ కుదిరినప్పుడు వంట చేసుకుంటూ, కుదరనపుడు ఆఫీస్ క్యాంటీన్లోనో, ప్యారీస్ కార్నర్ లో తనకి ఇష్టమైన ఆంధ్రా భోజన హోటల్ కి వెళ్ళో కడుపు నింపుకుంటూ ఉంటాడు. ఆనంద్ చేరిన రెండు నెలల తర్వాత అతని టీమ్ లోకి వచ్చిన వల్లిని మొదటి చూపులోనే గాఢంగా ఇష్టపడ్డాడు. ఆమె అతని కన్నా ఆరేళ్ళు చిన్నదైనా బీ టెక్ కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అవడం వలన టీ సీ యస్ వారి క్యాంపస్ ఇంటర్వ్యూలో టాపర్ గా ఉద్యోగం సంపాదించుకుంది. మల్టీ నేషనల్ కంపెనీలు కాదనుకుని ఇండియా కంపెనీలోనే చేరతానని పట్టుబట్టి చేరిందని తెలిసి ఆశ్చర్యపడ్డాడు ఆనంద్. తన ఊరికి దగ్గరలోనే వాళ్ళ ఊరు కూడా అని తెలిసి అబ్బురపడ్డాడు. తన కులమే అని తెలిసి ఆనందపడ్డాడు. ******** వారి మధ్య పరిచయం కాస్తా సాన్నిహిత్యం అక్కడ నుంచ...

జీవిత భాగస్వామి @

 జీవిత భాగస్వామి  సుందర రావు గారు ఉదయం ఏడు గంటల అయ్యేసరికి చక్కగా స్నానం చేసి కొత్త పంచె, లాల్చీ జరీ కండువా వేసుకుని చేతి కర్రతో హుందాగా వీధి వెంబడి నడుస్తూ ఉంటే అటూ ఇటూ ఇళ్లలో జనం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన చాలా రోజులుగా అంత పొద్దున్నే ఇల్లు కదలడం ఎవరూ చూసిన గుర్తు లేదు. అలా వెళ్లడం, వెళ్లడం ఆ పల్లెటూరు కి ఈశాన్యం మూలన ఉన్న చెరువు పక్కనే ఉన్న రామాలయం లోకి వెళ్ళారు . వెళ్లే ముందు బయట పూల దుకాణం లో చెప్పులు పెట్టేసి, కొబ్బరికాయ, పూలు, పళ్ళు తీసుకుని "డబ్బులు వెళ్ళేటప్పుడు ఇస్తాలే సూరప్పా” అని లోపలికెళ్ళాడు. సూరప్ప బుగ్గన చెయ్యేసుకుంది. ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చి, పూజారికి పళ్ళూ వగైరాలు ఇచ్చి, "సుదర్శనా ! ఇవాళ తెలుసుగా ? మా పెళ్లి రోజు, ఆవిడ పుట్టిన రోజు కూడా , తన పేరున సహస్రం చేసి, దీర్ఘ సుమంగళిగా దేవుణ్ణి వేడుకుంటూ పూజ చెయ్యి నాయనా !" నోరు తెరుచుకుని చూస్తున్న సుదర్శనాచార్యులు తడబడుతూ “సరే సరే స్వామీ !" అని హడావుడిగా గర్భగుడిలోకి వెళ్లి అర్చన మొదలెట్టాడు. సంకల్పం, ఆవాహనాది తతంగం పూర్తి చేసేసి సహస్ర నామాలు యాంత్రికంగా చదువుతూనే ఉన్నాడు కానీ తండ్రి మాధవాచార్యులు...

సామ్యం @

సామ్యం    "ఒరేయ్ అబ్బాయ్ ! నీకు యుక్త వయసు వచ్చింది. స్థిరపడే దిశగా ఉన్నావు, అందుకే నేను, అమ్మ నీకు వివాహం చేద్దామని అనుకుంటున్నాం." "ఇంకా అనుకుంటూనే ఉన్నారుగా ? నిర్ణయం చేసేయ్యలేదుగా ? బ్రతికించారు. నాకు ఇంకా పెళ్లి మీద ఆలోచనలు లేవు. దాని గురించి ప్రస్తావన తేవద్దు." ******* "నాయనా ! ఉద్యోగం లో కూడా స్థిరపడ్డావు ఒక ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకున్నావు ఇప్పుడైనా సరే ఆనరా !" "ఊహూ ! నా టార్గెట్ ఇంకా రీచ్ కాలేదు. పైగా ఇప్పుడు చేసుకున్నానంటే ఆ పిల్ల ఏమి తంటాలు తెస్తుందో ? వివాహం సర్వ నాశాయ అన్నది నా అభిప్రాయం." ***** "నాన్నా. ఉద్యోగంలో కూడా బాగా పైకి వచ్చావు. ఇప్పటికైనా చేసుకోరా ! చాలా మంది నా ప్రాణాలు తీస్తున్నారు. నీ పెళ్లి ఎప్పుడు చేస్తానని." "వాళ్లకి అంత ఆత్రం గా ఉంటే వేరే సంబంధాలు చూసుకోమని చెప్పు నాన్నా ! నాకు నా భార్య గురించి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాకు సరిపోయే అమ్మాయి నాకు దొరికి తీరుతుంది. నువ్వు మొన్న చెప్పిన అమ్మాయికి స్క్రూ లూజ్ , ఆ ఢిల్లీ అమ్మాయికి ఇంకో అఫ్ఫెయిర్ ఉందిట . బెంగళూరు అమ్మాయిని చేసుకుంటే కాపు...

తల్లి ప్రేమ @

తల్లి దుఃఖం "అమ్మా ! స్నానం చేసి వస్తాను . వడ్డించెయ్యి. ఆకలి వేస్తోంది " అంటూ తల్లి గదిలోకి వెళ్లిన శ్రావణ్ తల్లిని చూసి అవాక్కై ఉండిపోయాడు. తల్లి మంచం మీద కూర్చుని కన్నీరు కారుస్తోంది. ఆమె పక్కన చిన్న నవలిక మంచం మీద ఉన్నది. వెంటనే దానిని గుర్తు పట్టాడు. తాను వ్రాసిన నవలికే ! "తల్లి, సవతి తల్లి" తనకి చాలా గొప్ప పేరు తెచ్చిన నవల. అనేక మంది తనకి అభిమానులను చేసిన నవల. పెద్ద పుస్తకమేమీ కాదు, కానీ అందులోని కదా వస్తువు ఎంతోమందిని కదిలించి వేసింది. అందులో కదా నాయకుడు చిన్న తనంలోనే తల్లిని కోల్పోయి సవతి తల్లి పెంపకంలో పెరిగాడు. ఒక సవతి తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. సవతి తల్లి అతనిని అనేక బాధలు పెట్టినా ఓర్చుకుంటూ మంచి చదువులు చదివి, మరణించిన తండ్రి బాధ్యత తన భుజాల మీద వేసుకుని తమ్ముడిని, చెల్లెలిని చదివించి పెళ్లిళ్లు చేసి అందరి చేతా భేష్ అనిపించుకుంటాడు. కానీ సవతి తల్లి మారదు . చివరికి ఆయువు తీరిపోయి మరణించేటప్పుడు కూడా సవతి కొడుకు మొహం చూడడానికి ఇష్ట పడదు. తమ్ముడు చెల్లాయి మాత్రం అన్నను అమితంగా ప్రేమిస్తారు. తమ్ముడు కళ్ళ లో నీళ్లతో అంతిమ సంస్కారం తననే చెయ్యమంటే మృదువుగ...